calender_icon.png 20 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్జీత్ సింగ్ కన్నుమూత

19-09-2024 12:02:26 AM

న్యూఢిల్లీ: జాతీయ రైఫిల్ అసోసియేషన్‌కు 25 సంవత్సరాల పాటు కార్యదర్శిగా సేవలందించిన బల్జీత్ సింగ్ సేథీ (89) కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జాతీయ రైఫిల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కలికేష్ సింగ్ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ‘ఇది షూటింగ్ కుటుంబానికి తీరని లోటు. దేశంలో షూటింగ్ అభివృద్ధి కోసం బల్జీత్ చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన తన చివరి శ్వాస వరకు జూనియర్లకు విలువైన సలహాలు ఇచ్చారు. షూటర్లకు ఎంతో సపోర్ట్ చేశారు’ అని కలికేష్ అన్నారు.