calender_icon.png 31 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాను గంగాజలంతో

30-01-2025 12:50:07 AM

శుద్ధిచేసిన కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్, జనవరి 29 (విజయక్రాంతి): ఐదేళ్ల బీఆర్‌ఎస్ పాలన అవినీతి కంపుతో నిండిపోయిందని ఆరోపిస్తూ నిన్నటితో పాలన ముగిసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యుల అంజనక్కుమార్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు.

బీఆర్‌ఎస్, బీజేపీ దొంగ పార్టీలేనని, రాబోయే కాలంలో అవినీతి పార్టీలను ఓడించి కాంగ్రెస్ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేస్తానుని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మేయర్ సునీల్రావు పదవీకాలం ముగియడంతో మున్సిపల్ కార్పొరేషన్కు పట్టిన శని విరగడయిందంటూ కుంభమేళా నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో శుద్ధి చేశారు.