పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుతో విసిగిపోయానంటూ ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఓ వ్యక్తి అధికారుల సమక్షంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. అప్రమత్తమైన పోలీసులు, విజిలెన్స్ అధికారులు అతడిని అడ్డుకోవడంతో పెను ప్ర మాదం తప్పింది. వివరాలు.. ముషీరాబాద్ సర్కిల్ అడిక్‌మెట్ డివిజన్‌కు చెందిన తగ రం అనిల్ కుమార్.. రాంనగర్‌లోని సౌమ్య ఆసుపత్రి ఎదురుగా ఉన్న 430 గజాల స్థలంలో తన తల్లికి సంబంధించిన వాటా ఇవ్వకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని.. ఈ విషయంలో కోర్టు స్టే ఉన్న ప్పటకీ సదరు నిర్మాణదారుడి నుంచి రూ. 12 లక్షలు లంచం తీసుకుని అతడికి టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నారని వాపోయాడు. దీనికితోడు భవన నిర్మాణంలో ఉల్లంఘనలు జరుగుతున్నట్లు వాపో యాడు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు ఏళ్లుగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం, ముషీరాబాద్ సర్కిల్ (అబిడ్స్) కార్యాలయానికి తిరుగుతున్నా అధికారులు పట్టించు కోవడం లేదని వాపోయాడు. ఈ క్రమంలో సోమవారం ప్రాజావాణిలో పాల్గొని అధికారుల తీరుకు నిరసనగా ఒంటిపై పెట్రోల్ పో సుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.