- పాతుకుపోయిన ఆ ‘సార్స్’ కుర్చీ కదలిక
- వారిని మదర్ డిపార్ట్‌మెంట్‌కు పంపేందుకు రంగం సిద్ధం
- డిప్యుటేషన్‌పై మరో ముగ్గురు ఏఎంఓహెచ్‌లు
- హెల్త్ విభాగంలో కీలక మార్పులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): జీహెచ్ ఎంసీ పరిధిలోని హెల్త్ సెక్షన్ సర్కిళ్లలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్)గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు జీహెచ్ ఎంసీని వదిలిపెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు నాలుగేం డ్లు.. కాదు ఏకంగా ఏడేనిమిదేళ్లుగా అదే పోస్టుల్లో పాతుకుపోయినా.. వారు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండాలని కోరుకుంటున్నారని బల్దియా వర్గాలు తెలుపుతు న్నాయి.
ఈ నేపథ్యంలో ఆ అధికారులను తమ సొంతశాఖకు పంపించేందుకు రంగం సిద్ధమవుతు న్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఖాళీగా ఉన్న ఏఎంఓహెచ్ పోస్టుల్లో మరో ముగ్గురు వైద్యులు డిప్యుటేషన్‌పై రానున్నట్లు తెలుస్తున్నది.
సీఎంఓహెచ్‌పై కూడా విమర్శలు..
బల్దియా ప్రధాన కార్యాలయం కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్)పై కూడా విమర్శలు వస్తున్నాయి. డిప్యుటేషన్‌పై ఆయన నాలుగేళ్లకు పైగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
సదరు అధికారిణి జీహెచ్‌ఎంసీలో ఇంకెంత కాలం ఉంటారంటూ ఆమెపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలు తన మీదకు రాకుండా సాధారణ సిబ్బందిపైకి వెళ్లేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమతో కొందరు ఏఎంఓహెచ్‌కు పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
వీరి మధ్య లావాదేవీలు విషయమై వారిద్దరికీ పడటం లేదని తెలిసింది. జీహెచ్‌ఎంసీకి డిప్యూటేషన్‌పై మరో ముగ్గురు వైద్యాధికారులు రావాల్సి ఉండగా, ఇటీవల బదిలీలు జరిగిన నేపథ్యంలో టెక్నికల్‌గా కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
సొంత శాఖకు..
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో 30 మంది ఏఎంఓహెచ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సుమారు 20 డాక్టర్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు. ఉన్నతాధికారులు మిగతా 10 మందికి డీఈ స్థాయి ఇంజినీరింగ్ అధికారులకు పోస్టింగ్ కేటా యించారు. వీరు వీధుల్లో పారిశుధ్య నిర్వహణ, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ చేయడం వీరి బాధ్యత.
అయితే, జీహెచ్‌ఎంసీలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అవినీతి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వీరి అక్రమ వ్యవహారాలే తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అవినీతిని ప్రక్షాళన చేసేందుకు ఏ ఉన్నతాధికారీ స్పందించిన దాఖలాలు లేవు.