హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ 2025 వార్షిక బడ్జెట్ సమావేశం ఈనెల 30న జరుగుతుందని కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఫిబ్ర 1న జీహెచ్‌ఎంసీ 10వ కౌన్సిల్ స నిర్వహించాలని ముందుగా భావించామన్నారు. కానీ ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈనెల 30వ తేదీ గురువారం గ్రేటర్ బడ్జెట్ సమావేశం జరిపేందుకు పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.