calender_icon.png 16 April, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్ల అంబేద్కర్ జయంతి వేడుకలో బాలయోగి

14-04-2025 06:56:46 PM

చర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో ప్రముఖ విద్యావేత్త, పాత్రికేయులు, భద్రాచలం గిరిజన గురుకుల కళాశాల చరిత్ర అధ్యాపకులు తోటమల్ల బాలయోగి పాల్గొన్నారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశానికి చేసే సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సాగర్ గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాస్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు తెల్లం నరేష్, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, తోటమల్ల గోపాలరావు,ఏడెళ్ళ గణపతి, తోటమల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.