రంగారెడ్డి,(విజయక్రాంతి): గణపతి నిమజ్జనం వచ్చిందంటే చాలు అందరి దృష్టి బాలపూర్ పై పడుతుంది. గత ఏడాది రికార్డులను తిరగరాస్తు బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. ఏకంగా రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాడి రికార్డు స్థాయి ధరతో బీజేపీ నేత మాజీ సింగిల్ విండో ఛైర్మన్.. బాలపూర్ గ్రామానికి చెందిన కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో రూ.27లక్షలు పలకింది. దయానంద రెడ్డి దక్కించుకున్నారు.
దీంతో ఈసారి వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా రూ.27 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్వాహకులు కొత్త రూల్ పెట్టారు. కాగా 28 ఏళ్లుగా బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. 1994 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు. తొలిసారి రూ.450 పలికింది. 2001 నుంచి ధర వేల రూపాయలు పలకడం మొదలైంది. 2002లో కందాడ మాధవరెడ్డి రికార్డు స్థాయిలో ఒక లక్ష 5 వేల రూపాయలతో లడ్డూ దక్కించుకున్నారు. ఆ మరుసటి ఏడాది నుంచి లక్ష చొప్పున ధర పలుకుతూ వచ్చింది.
2007లో రఘునందన చారి ఏకంగా రూ.4.15 లక్షలకు లడ్డూను కొనుగోలు చేశారు. 2015లో రూ.10 లక్షలు, 2016లో రూ.14.65లక్షలు, 2017లో రూ.15.60 లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు, 2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు, 2023లో రూ.27 లక్షలు చొప్పున ధర పలికింది. కాగా కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలంపాటను రద్దు చేశారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఉన్న భక్తులు
- లింగాల దశరథ్ గౌడ్ ( కర్మన్ ఘాట్)
- అర్బన్ గ్రూప్ - సామా ప్రణీత్ రెడ్డి (సాహెబ్ నగర్)
- సందీప్ రెడ్డి -ఎస్ వై ఆర్ ఫౌండేషన్ ( పోచారం)
- కొలన్ శంకర్ రెడ్డి ( బాలాపూర్)
- శ్రీ గీత డైరీ - లక్ష్మీనారాయణ -( నాదర్గుల్)
- సామ కార్తీక్ రెడ్డి, వర్ధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి బ్రదర్