calender_icon.png 13 January, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబలెంక సాఫీగా

13-01-2025 12:16:13 AM

  • స్టీఫెన్స్‌పై సులువైన విజయం

జ్వెరెవ్, కాస్పర్ రూడ్ ముందంజ

సుమిత్ నాగల్ తొలి రౌండ్‌కే పరిమితం

ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంక సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన సబలెంక 6 6 అమెరికాకు చెందిన స్టీఫెన్స్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆద్యంతం ఆధిపత్యం ప్రద ర్శించింది.

మ్యాచ్‌లో 2 ఏస్‌లు సంధించిన సబలెంక 20 విన్నర్లు కొట్టింది. ఇక స్టీఫెన్స్ మ్యాచ్‌లో 16 అనవసర తప్పిదాలు చేసింది. రెండో రౌండ్‌లో సబలెంక స్పెయిన్‌కు చెందిన బౌజాస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ జెంగ్ 7 (7/3), 6 టొడోనిపై, 11వ సీ డ్ బడోసా 6 7 (7/5)తో వాంగ్‌పై విజయాలు సాధించారు. మిర్రా ఆండ్రీవా, డొనా వెకిక్ కూడా ముందంజ వేశారు. నేడు జరగనున్న సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్, అల్కరాజ్, సిన్నర్, స్వియాటెక్, గాఫ్ బరిలోకి దిగనున్నారు.

సుమిత్ నాగల్ ఓటమి

పురుషుల విభాగంలో భారత్ తరఫున సింగిల్స్‌లో బరిలోకి దిగిన సుమిత్ నాగల్ తొలి రౌండ్‌కే పరిమితమయ్యాడు. తొలి రౌండ్‌లో నాగల్ 3 1 5 చెక్ రిపబ్లిక్‌కు చెందిన టోమస్ మెక్‌హక్ చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు. గతేడాది రెండో రౌండ్‌కు చేరిన నాగల్ ఈసారి మాత్రం ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ శుభారంభం చేశాడు.

తొలి రౌండ్‌లో జ్వెరెవ్ 6 , 6 6 ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్ పౌలీపై విజయాన్ని అందుకున్నాడు. ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (డెన్మార్క్) 6 1 7 2 6 మునార్‌పై అతికష్టం మీద నెగ్గాడు. తొలి సెట్‌లో ఓడినప్పటికీ రెండో సెట్ గెలిచిన మునార్ నాలుగో సెట్ కూడా గెలవడంతో ఒక దశలో రూడ్ ఓటమి దిశగా పయనించాడు.

అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన రూడ్ ఓటమి నుంచి గట్టెక్కాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన హాడీ హబీబ్ గ్రాండ్‌స్లామ్‌లో లెబనాన్ తరఫున తొలి విజయం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. హాడీ 7 (7/4), 6 7 (7/6)తో చైనాకు చెందిన యుంచాకెటెపై గెలుపొందాడు.