నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘డాకు మహరాజ్’. ఆయన 109వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.
బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనుండటంతోపాటు ‘అఖండ’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా చిత్ర యూనిట్ వదులుతోంది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దీంతో సెకండ్ సింగిల్‌కు ముహూర్తం పెట్టేశారు.
ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘చిన్ని’ అనే లిరికల్ సాంగ్‌ను ఈ నెల 23న మేకర్స్ విడుదల చేయనున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ సర్‌ప్రైజ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 4న డల్లాస్‌లో నిర్వహించనున్నారు.