calender_icon.png 20 April, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్ దర్శకత్వంలో బాలకృష్ణ

09-04-2025 12:00:00 AM

నందమూరి బాలకృష్ణ వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సమాచారం. మరోవైపు హరీశ్ శంకర్.. హీరో రామ్ పోతినేనితోనూ ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అటు పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను హరీశ్ పూర్తి చేయాల్సి ఉంది. ఏది ఏమైనా బాలయ్యతో హరీశ్ సినిమా వార్తలు నిజమే అయితే అభిమానులకు పూర్తిస్థాయి విందు భోజనం పక్కా అనైతే అర్థమవుతోంది.