న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కు భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కు జతగా శ్రీరామ్ బాలాజీని ఎంపిక చేసినట్లు భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) గురువారం స్పష్టం చేసింది. దీంతో ఒలింపిక్స్‌లో భారత్ తరపున పురుషుల డబుల్స్ మ్యాచ్‌లు ఆడేందుకు బోపన్నతో బాలాజీ జతకట్టనున్నాడు. కాగా 44 ఏళ్ల బోపన్న తనకు జోడీగా బాలాజీని ఏంచుకున్నట్లు ఐటా తెలిపింది. యూకీ బాంబ్రీ పోటీలో ఉన్నప్పటికీ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్‌లో బాలాజీ అద్వితీయ ప్రదర్శనతో ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్నాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొనే బోపన్న తనకు జోడీగా బాలాజీని ఎంపిక చేసుకున్నట్లు పేర్కొంది. రోహన్ బోపన్న ఎబ్డెన్ జోడీ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.