calender_icon.png 7 October, 2024 | 7:45 AM

నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్ సంస్మరణ సభ

06-10-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మానవ హక్కుల వకీలుగా కీర్తిపొందిన మానవ హక్కుల నేత కే బాలగోపాల్ 15వ సంస్మరణ సభను  ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు హ్యూమన్ రైట్స్ ఫోరమ్ బాధ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్మరణ సభలో ‘పాలస్తీనాలో ఇజ్రాయెల్ సామూహిక హననం ప్రాజెక్టు’ అంశంపై రచయిత అచిన్ వనాయక్ ప్రసంగించనున్నట్లు తెలిపారు.

అలాగే ‘ప్రజా ఉద్యమాలలో మేధోలోపం’ అంశంపై చైత న్య హక్కుల కార్యకర్త తాషీ చోడప్, ‘కనెక్టివిటీ విత్‌అవుట్ లిబర్టీ’ అంశంపై ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్‌కు చెందిన అపర్ గుప్త ప్రసంగించనున్నారు. అలాగే ఉమర్ ఖలీద్, సహచర రాజకీయ ఖైదీలపై లలిత్ వచాని తీసిన సినిమాను ఒక గంట పాటు ప్రదర్శించనున్నారు.

సంఘం అనేది వ్యత్యాసాన్ని నిర్మూలించడం ద్వారా కాదు, దాని ధృవీకరణ ద్వారా ఏర్పడుతుందనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సంస్మరణ సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.