calender_icon.png 13 November, 2024 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్ ఠాక్రే ఫొటోతో ఓట్లు అడుక్కుంటున్నారు

10-11-2024 02:07:37 AM

ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు

ముంబై, నవంబర్ 9: మహాయుతి కూటమి తన ఎన్నికల ప్రచారంలో బాల్ ఠాక్రే ఫొటోలను ఉపయోగించడం పట్ల శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జల్నాలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రంలో ఎక్కడికెళ్లినా తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పోస్టర్లు కనిపిస్తున్నాయన్నారు. బీజేపీ పోస్టర్లలో బహుశా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటోలు ఉండకపోవచ్చన్నారు. వారిద్దరి ఫొటోలు ఓటమికి చిహ్నమని విమర్శించారు. 

మోదీ సమాధానం చెప్పాలి

బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోంద ఆదిత్య ఠాక్రే విమర్శించారు. విభ జించి, దోచుకోవడం బీజేపీ విధానమని ఆరోపించారు.  బీజేపీ మహారాష్ట్రను పక్కన పెట్టి గుజరాత్‌కు ప్రాముఖ్యం ఇస్తుందనా ్నరు. మహారాష్ట్ర యువతకు బీజేపీ ఎం దుకు ఉద్యోగఅవకాశాలు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వీటికి సమానం చెప్పాలని డిమాండ్ చేశారు.