calender_icon.png 11 January, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బక్రీద్ ఖుబానీ పంచుతామంటూ రూ. 23 లక్షలకు టోకరా

03-07-2024 09:20:06 PM

హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా ఖుబానీ(మాంసం) పంచుతామంటూ రూ. 23 లక్షలకు టోకరా వేసి పరారైన ముగ్గురు నిందితులను బుధవారం సౌత్‌వెస్ట్ జోన్ పరిధిలోని ఆసిఫ్‌నగర్ డివిజన్ హబీబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... బక్రీద్ సందర్భంగా తక్కువ ధరకు ఖుబానీ(మాంసం) అందిస్తామంటూ కిడ్మత్ ఫౌండేషన్ పేరుతో పలు ప్రాంతాల్లో కార్యాలయాలు తెరచి సుమారు 1049  మంది బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2.800 వసూలు చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం మాంసం అందివ్వకపోవడంతో కస్టమర్లు మోసపోయామని గ్రహించి కార్యాలయాలకు వెళ్లి చూడగా అవి మూసి వేసి ఉన్నాయి. దీంతో  గత నెల 17న అఘాపురకు చెందిన అబ్దుల్ బారీ రేహన్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బహద్దురపురకు చెందిన మహ్మద్ నసీర్(30), బండ్లగూడకు  చెందిన మహ్మద్ జాఫర్ అహ్మద్(29), మహ్మద్ అష్ఫక్(27) లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 23 లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.