చేవెళ్ల: కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా మల్కాపూర్ గ్రామానికి చెందిన బక్క రెడ్డి యాదిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించడం పట్ల యాది రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పామెన భీమ్ భరత్ లకు ఈ సందర్భంగా యాదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.