కలెక్టర్ ఫిర్యాదుకు స్పందన కరువు
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
మున్సిపల్ కమిషనర్ సుజాత
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: ఒకవైపు దట్టమైన పొగ... మరోవైపు విపరీతమైన దుర్గంధం.. వీటికి తోడుగా జామైన మురుగు కాలువలు, విజ్జ్రంభిస్తున్న దోమలు, సంచరిస్తున్న పాములు వెలసి ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణ పరిధిలోని గట్టాయిగూడెం వాసుల వెతలు. గత పది సంవత్సరాలుగా బేకరీల సమస్యలతో అవస్థ పడుతున్న ప్రజలు సమస్యలను భరిస్తూ... ఆరోగ్యాలను క్షమింప చేసుకుంటూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని కాలనీవాసులు వాపోతున్నారు.
నడి ఊర్లో బేకరీలకు అనుమతి ఎలా వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. బేకరీల నుంచి వెలబడుతున్న దట్టమైన పగతో వాతావరణ కాలుష్యం, దుర్గంధంతో ప్రజలకు తీరని ఇబ్బందులు చాలా ఉన్నట్లుగా, బేకరీలో తయారు చేసేటప్పుడు ఉపయోగించి చెప్పింది నూనె పదార్థాలను కాలువలో వదలటంతో మరుగు కాలువలు జామై తీవ్రమైన దుర్గంధం, దోమల విధులు మంచి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి వేటికి తోడు పాముల సంచారం పెరిగిందని ప్రజల భయంతో చెందుతున్నారు . మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఫలితం లేకపోవడంతో 15 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన నేటికీ అధికారుల జాడలేరని వారు వాపోతున్నారు. ఆ కాలనీలో ప్రతి ఇంట్లో శ్వాస కోస సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తమ ఇబ్బందులను ప్రత్యక్షంగా తిలకించి బేకరీల ను ఇళ్ళ మధ్య నుంచి తొలగించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.