calender_icon.png 18 October, 2024 | 2:25 PM

రేపు రాష్ట్రవ్యాప్తంగా బజరంగ్ దళ్ భారీ ఆందోళన

18-10-2024 01:26:49 AM

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, వాటి ని అదుపుచేయడంలో రాష్ట్రప్రభు త్వం పూర్తిగా విఫలమవుతోందని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేవాలయాలకు రక్షణ కల్పించాలని, హిం దూ దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న రాష్ర్ట వ్యాప్త ఆందోళనకు ఈ సంఘాలు పిలుపునిచ్చాయి.

శనివారం రోజు రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు నిర్వహిస్తు న్నట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ర్ట అధ్యక్షులు నరసింహమూర్తి, బజరంగ్ దళ్ రాష్ర్ట కన్వీనర్ శివరా ములు తెలిపారు. ధర్నా అనంతరం ఆయా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. రాష్ర్టవ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల వివరాలను అందజేస్తామని పేర్కొన్నారు.

హిం దూ బంధువులందరూ అధిక సం ఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని వా రు విజ్ఞప్తి చేశారు. భాగ్యనగరంలో వరుసగా హిందూ దేవాలయాలపై, దేవతామూర్తులపై దాడులు చేసి ధ్వంసం చేస్తున్నా ఇప్పటివరకు రా ష్ర్ట ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో రాజకీ యాలకు అతీతంగా భారీఎత్తున హాజరుకావాలని హిందువులకు పిలుపునిచ్చారు.