హైదరాబాద్, డిసెంబర్ 20: బజాజ్ ఆటో తన చేతక్ బ్రాండ్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం విడుదల చేసింది. కొత్త‘35 సిరీస్’లో మూడు వేరియంట్స్ 3501, 3502, 3503 మోడల్స్‌లో తొలి రెండు వేరియంట్స్ ధర రూ.1.27 లక్షలు, రూ.1.20 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది. 3501 వేరియంట్ డెలివరీలు డిసెంబర్ చివర్లో ,3502 జనవరిలో మొదలవుతాయని కంపెనీ తెలిపింది. మూడవ వేరియంట్ ధరను కొద్ది రోజుల్లో ప్రకటిస్తుంది. తమ చేతక్ స్కూట్ 27.6 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉన్నదని బజాజ్ ఆటో తెలిపింది. కొత్త మోడల్‌లో ఫుల్ నేవిగేషన్ స్క్రీన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, మ్యూజిక్ ప్లేయర్, సెల్‌ఫోన్‌కు బ్లూటూత్, స్పీడ్ లాక్ సెట్టింగ్, థెఫ్ట్ ఎలర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.