calender_icon.png 19 January, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజూ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ జోరు

17-09-2024 11:59:33 PM

ముంబయి: లిస్టింగ్ రోజు అదరగొట్టిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రెండోరోజూ రాణించింది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లోఅప్పర్ సర్క్యూట్ తాకింది.బీఎస్‌ఈలో ఏకంగా 10శాతం పెరిగి రూ.181.48 కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 10శాతం లాభపడి 181.50 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12,417.27 కోట్లు పెరిగి రూ.1,49,823. 36 కోట్లకు చేరింది.సోమవారం మార్కెట్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. ఇష్యూ ధర రూ.70 కాగా.. రూ.114 ప్రీమియంతో రూ.150 వద్ద స్టాక్ ఎక్స్‌చేంజీల్లో లిస్టయ్యింది.

అనంతరం 136శాతం దూసుకెళ్లింది. రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది. రూ.6,560 కోట్లు సమీకరించేందుకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకు వచ్చింది. సెప్టెంబర్ 11 బిడ్డింగ్ చివరినాటికి 63.60 రెట్ల సబ్‌స్క్రిపన్‌తో దూసుకెళ్లింది. ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్లు విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయగా.. మరో రూ.3వేల కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించింది.