calender_icon.png 18 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో

02-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.6,500 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) సెప్టెంబర్ 9న ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 11న ఆఫర్ ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్‌ను సెప్టెంబర్ 6న తెరుస్తామని కంపెనీ తెలిపింది. ఐపీవోలో రూ. 3,560 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేస్తుంది. మరో రూ. 3,000 కోట్ల ఈక్విటీ షేర్లను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాతృసంస్థ బజాజ్ ఫైనాన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయిస్తుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల్ని క్యాపిటల్ బేస్‌ను పెంచుకోవడానికి, భవిష్యత్ మూలధన అవసరాలకు వినియోగిస్తుంది.