calender_icon.png 17 January, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ జోరు

10-09-2024 12:40:19 AM

3 గంటల్లో 80 శాతం సబ్స్క్రిప్షన్

ముంబయి: బజాజ్ గ్రూపునకు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సోమవారం ప్రారంభమైంది. రూ.6560 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఐపీఓకు రాగా.. తొలిరోజు మూడు గంటల్లోనే దాదాపు 80 శాతం సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్‌ఐఐ కోటా దాదా పు 1.95 రెట్లు ఓవర్ సబ్‌‌‌రరస్కైబ్ కావడం గమనార్హం. రిటైల్ కోటాలో కేటాయించిన షేర్లకు 85 శాతం బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 68 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 59 కోట్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి.

ఐపీఓలో భాగంగా రూ.3,560 కోట్లు విలువైన తాజా షేర్లను కంపెనీ జారీ చేయగా.. మరో రూ.3వేల కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయిస్తోంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.66-70గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా మదుపర్లు కనీసం 214 ఈక్విటీ షేర్లతో కూడిన లాట్‌కు బిడ్ వేయా ల్సి ఉంటుంది. సెప్టెంబర్ 11న ఆఫర్  ముగియనుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.1,258 కోట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది.