calender_icon.png 22 October, 2024 | 5:14 PM

బజాజ్ ఆటో లాభం రూ.1,942 కోట్లు

17-07-2024 06:55:39 AM

న్యూఢిల్లీ, జూలై 16: ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 18 శాతం వృద్ధిచెంది రూ. 1,942 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.1,644 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఆటో మొత్తం ఆదాయం రూ.10,312 కోట్ల నుంచి రూ. 11,932 కోట్లకు పెరిగింది. ఈ ఏప్రిల్ మధ్యకాలంలో తమ అమ్మకాలు 7 శాతం వృద్ధితో 11,02,056 యూనిట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది.

దేశీయ మార్కెట్లో విక్రయాలు 8 శాతం పెరిగి 6,90,621 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 7 శాతం వృద్ధి చెంది 4,11,435 యూనిట్లకు చేరినట్టు బజాజ్ ఆటో వివరించింది. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సంగీతారెడ్డిని ఐదేండ్లకు అదనపుడైరెక్టర్‌గా నియమించే ప్రతిపాదనను ఆమోదించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 1.34 శాతం పెరిగి రూ.9,805 వద్ద ముగిసింది.