11-03-2025 01:14:43 AM
కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో 540 మందికి విముక్తి
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఉద్యోగాల కోసం వెళ్లి థాయ్‌లాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్‌లో బందీలుగా మారిన వందలాది మంది భారతీయులకు విముక్తి లభించింది. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో వీరిని స్వదేశానికి రప్పిస్తున్నారు. 540 మంది బందీలను గుర్తించగా, వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మంది ఉన్నారు. వీరిలో 270 మందితో బయల్దేరిన విమానం ఇప్పటికే సోమవారం ఢిల్లీకి చేరింది. మిగిలిన 270 మందితో కూడిన విమానం మంగళవారం ఇండియాకు రానుంది.