calender_icon.png 7 January, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు ఎర

05-01-2025 01:21:39 AM

  1. అమెరికా మోడల్ ముసుగులో యువకుడి సైబర్ స్కామ్
  2. స్నాప్‌చాట్, బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారా 700 మంది మహిళలకు గాలం
  3. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సంపాదించి డబ్బు కోసం బెదిరింపు
  4. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు అరెస్ట్

న్యూఢిల్లీ, జనవరి 4:  ఢిల్లీకి చెందిన 23ఏళ్ల తుషార్ సింగ్ బిస్త్ దారుణానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా స్నేహం పేరుతో 18-30ఏళ్ల వయసున్న మహిళలకు దగ్గరై వారి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సంపాదించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం తూర్పు ఢిల్లీలోని షాకార్‌పూర్‌లో తుషార్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. తుషార్ సింగ్ డబ్బు, మహిళ మీద మోజుతో సైబర్ నేరాలకు పాల్పడ్డట్టు పేర్కొన్నారు.   అమెరికాకు చెందిన మోడల్‌గా అతడు స్నాప్‌చాట్, బంబ్లీ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ ప్రొఫైల్ సృష్టించడంతోపాటు బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రముఖ మోడల్ ఫొటోను డీపీగా పెట్టుకుని మహిళలకు గాలం వేశాడు.

ఓ ప్రాజెక్ట్ పని మీద ఇండియాకు వచ్చినట్టు నటిస్తూ దాదాపు 700 మంది మహిళలకు తుషార్ సింగ్ దగ్గరయ్యాడు. అనంతరం స్నేహం పేరుతో కొందరు మహిళల నుంచి ప్రైవేటు ఫొటోలు, వీడియోలు సంపాదించి.. వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు.

తాజాగా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విదార్థిని తుషార్ సింగ్ చేతిలో మోసపోయింది. తొలుత అతడు అడిగట్టు డబ్బులు పంపిన ఆ యువతి, తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాకార్‌పూర్‌లో రెయిడ్ చేసి తుషాక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అతడి వద్ద నుంచి కొందరు మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బంబ్లీ డేటింగ్ యాప్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది మహిళలతో చాటింగ్ చేసినట్టు గుర్తించామన్నారు.