calender_icon.png 26 April, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కాళాంకి బైరవుడు’

25-04-2025 12:00:00 AM

‘శ్రీరాముడింట’, ‘శ్రీకృష్ణుడింట’, ‘నివాసి’ వంటి చిత్రాల తర్వాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం ‘కాళాంకి బైరవుడు’. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకుం టున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌వర్మ, పూజకిరణ్ హీరోహీరొయిన్లుగా నటిస్తున్నారు. హరిహరన్ వీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఎన్‌రావు, శ్రీనివాసరావు ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను సీనియర్ నట దంపతులు రాజశేఖర్ జీవిత లాంచ్ చేశారు.

హీరోను ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఇంకా ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేశ్, ‘బలగం’ జయరాం, భవ్య, మహమద్ బాషా, బిల్లి మురళి నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు మాట్లాడతూ.. ‘హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీశాం.

దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను అతిత్వరలో విడుదల చేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: అశోక్ అన్నెబోయిన; సంగీతం: పెద్దపల్లి రోహిత్; ఎడిటర్: సాయికిషోర్ కే; యాక్షన్: రామ్ సుంకర; ఆర్ట్: బీ జగన్.