calender_icon.png 17 November, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిభవ్‌కు బెయిల్

03-09-2024 01:09:42 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అనుచరు డు బిభవ్‌కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టయి 100 రోజులుగా జైల్లోనే ఉన్నాడు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘పిటిషనర్ 100 రోజులుగా కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

గాయాలు సాధారణమైనవే. అందువల్ల బెయిల్ ఇవ్వవచ్చు. మీరు (దర్యాప్తు సంస్థ) వ్యతిరేకించాల్సిన పనిలేదు. ఇలాంటి కేసుల్లో నిందితుడిని ఎంతోకాలం జైళ్లోనే ఉంచకూడదు’ అని ఢిల్లీ పోలీసుల తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఎస్‌వీ రాజుతో ధర్మాసనం పేర్కొన్నది. బిభవ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, కేజ్రీవాల్‌కు మళ్లీ వ్యక్తిగత సహాయకుడిగా కానీ.. సీఎం కార్యాలయంలో ఎలాంటి పదవి ఇవ్వకూడదని షరతు విధించింది.