calender_icon.png 23 November, 2024 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెయిలొచ్చింది

22-11-2024 12:00:00 AM

సినీ నటి కస్తూరికి తాజాగా ఊరట లభించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కస్తూరికి తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాను సింగిల్ మదర్ అని.. తనకు స్పెషల్ చైల్డ్ ఉందని.. పాప బాగోగులు చూసుకోవాల్సి ఉందంటూ కోర్టుకు కస్తూరి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు ఇరువైపుల వాదనలు విన్న మీదట కస్తూరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా.. చెన్నైలో తమిళ బ్రాహ్మణ సంఘం నిర్వహించిన కార్యక్రమంలో కస్తూరి తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు కస్తూరికి 14 రోజుల రిమాండ్ విధించింది.