calender_icon.png 31 October, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్శన్‌కు బెయిల్

31-10-2024 02:27:41 AM

కర్ణాటక హైకోర్టు తీర్పు 

బెంగళూరు, అక్టోబర్ 30: అభిమానిని హత్య చేసినట్లు ఆరోపణలతో అరెస్టయి జైలుకెళ్లిన కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం తొలుత సెషన్స్ కోర్టులో దర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. వెన్నునొప్పి, మూత్రపిండాల వ్యాధులు, కాళ్లలోని నరాల్లో రక్త ప్రసరణ లేదని, ఇందుకు శస్త్ర చికిత్స అవసరమని పిటిషన్‌లో వెల్లడించారు. దీన్ని సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయిం చారు. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా నెలన్నర పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.