calender_icon.png 28 October, 2024 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందు బీసీల జన గణన.. తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

29-07-2024 06:34:22 PM

పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంల్లో వరంగల్ లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని నేరవేర్చి రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్ లాల్ డిమాండ్ చేశారు. మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో 52 నుంచి 60 శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందనన్నారు.

బీసీల జన గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 77 సంవత్సరాల పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ది సాధించేందుకు రిజర్వేషన్ కల్పించాలని శంకర్ లాల్ తెలిపార. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉండలన్నారు.