calender_icon.png 31 October, 2024 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుల పండువగా ‘బహుదా యాత్ర’

16-07-2024 02:20:53 AM

భువనేశ్వర్, జూలై 15: పూరీ జగన్నాథుని సన్నిధిలో బహుదా యాత్ర కనుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు పాల్గొని జగన్నాథుని రథాలను లాగారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ ముందే యాత్ర స్టార్ట్ అయింది. జూలై 7న ప్రారంభమైన రథయాత్ర బహుదా యాత్ర (రథాలు వెనక్కు రావడం)తో సమాప్తం అయింది. గుడించా ఆలయ పరిసరాల్లో లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. అంతకు ముందు లక్షలాది మంది భక్తుల సమక్షంలో గుడించా ఆలయం నుంచి స్వామివారిని, అమ్మవార్లను రథాల మీదకు తీసుకువచ్చారు.