calender_icon.png 1 March, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ

28-02-2025 09:15:07 PM

ఎల్బీనగర్: హస్తినాపురం డివిజన్ సాగర్ రోడ్డు లోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ లో బహదూర్ గూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్లగొండ శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ హాజరై శ్రీనివాస్ ని సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దరంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

తెలంగాణ ఉద్యమంలోనూ ఉపాధ్యాయులు పాత్ర పోషించారన్నారు. కాగా, బహదూర్ గూడ పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరారు.  అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బుడ్డ సత్యనారాయణ, పాశం అశోక్ గౌడ్, చంపాపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, నాయకులు దాము, మహేందర్ యాదవ్, ఓరుగంటి నరేష్, అంతటి శ్రీనివాస్ గౌడ్, తోకటి కిరణ్, బద్రీనాథ్, కారుకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.