‘ఉగ్రమ్’, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సినిమాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన చిత్రం ‘బఘీర’. యాక్షన్ ఎంటర్‌టైన ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి కథానాయకుడిగా నటిస్తున్నారు. డాక్టర్ సూరి దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రుక్మిణీ వసంత్, ప్రకాశ్‌రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్‌కుమార్, గరుడరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్ మెంట్ ఎల్‌ఎల్‌పీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘రుధిర హర’ ఈ నెల 17న సంగీత ప్రియుల ముంగిట్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్; యాక్షన్: చేతన్ డి సౌజా; నిర్మాత: విజయ్ కిరగందూర్; కథ: ప్రశాంత్ నీల్; స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి.