calender_icon.png 23 October, 2024 | 2:58 PM

బఘీర రుధిర హర

19-10-2024 12:00:00 AM

ఉగ్రమ్ ఫేమ్ శ్రీమురళి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘బఘీర’. ఇది శ్రీమురళికి తొలి తెలుగు చిత్రం. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథ అందించా రు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తు న్నారు. ఈ చిత్రం నుంచి ‘రుధిర హర’ అనే తొలి పాటను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు.

అనిరుద్ధ శాస్త్రి ఈ పాటను ఆలపించారు. బఘీరలో రుక్మిణి వసంత్, ప్రకాశ్‌రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.