కామారెడ్డి (విజయక్రాంతి): బడుగు బలహీన గిరిజన వర్గాల వారు బిర్ష్య ముండాను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో 150 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల అభివృద్ధి కోసం తాపత్రయ పడిన వ్యక్తి బిర్ష ముండా అని కొనియాడారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన చిత్రపట్నానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిసిడిఓ రజిత, జిల్లా ప్రత్యేక అధికారి పద్మ, సిపిఓ రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో అధ్యక్షులు నారాయణ వెంకటరెడ్డి, సాయిరెడ్డి, గిరిజన శాఖ సిబ్బంది, గిరిజన నాయకులు పాల్గొన్నారు.