calender_icon.png 16 April, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్

15-04-2025 12:35:33 AM

అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వక్తలు కొనియాడారు.  సోమవారం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళ్లు అర్పించి స్మరించుకున్నారు. 

  1. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 
  2. అణగారిన వర్గాలకి ఆశాకిరణం అంబేద్కర్ : ఎమ్మెల్యే వినోద్ 
  3. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
  4. అంబేద్కర్ ఆశయసాధనకు పాటుపడాలి...
  5. జయంతి వేడుకల్లో వక్తల పిలుపు

ఆదిలాబాద్/బెల్లంపల్లి అర్బన్/బెల్లంపల్లి/నేరడిగొండ, ఏప్రిల్ 14(విజయ క్రాం తి) : ప్రతి ఒక్కరికి చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తోందని, దీనికి భారత రాజ్యాం గ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే నిదర్శనం అని పలువురు వక్తలు పేర్కొన్నా రు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయం తి వేడుకల సందర్భంగా ఆదిలాబాద్‌లో సోమవారం అధికారికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఆమెర్ ఆలీఖాన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్  తదితరులు పాల్గొన్నారు.

ముందుగా షెడ్యూల్ కులాల అభివృధ్ధి శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని  జ్యోతి ప్రజ్వలన గావించి, అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  అనంతరం అంబేద్కర్ చౌకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ,ఎస్పీ లు  పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు అతిధులు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతి ప్రధానం చేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని, ఉన్నత చదువులు చదివి, అగ్ర స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశం, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. జయంతి సందర్భంగా నాయకులు తెలిపిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత మహనీయుల బాటలో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ఆయా దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.  

అంబేద్కర్ అణగారిన వర్గాలకి ఆశాకిరణం: ఎమ్మెల్యే గడ్డం వినోద్ 

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు సంబరాన్నoటాయి. శాంతి గనిలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్ పాలవని మాట్లాడారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఎమ్మెల్యే నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. భారత స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల, వికాసానికి పాడుపడిన మహానేత భారతరత్న    డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు.  అణగారిన వర్గా లకి డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశాకిరణమని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడి సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజ ర్ విజయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు బడికల రమే ష్, కిరణ్, కాంగ్రెస్ నాయకులు సిహెచ్ శంకర్, మునిమంద రమేష్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

* బోథ్ నియోజకవర్గంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు.  ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సమసమాజ నిర్మాణమే అంబేద్కర్ ఆశయం

* దేశంలో అందరికీ సమాన హక్కులు ఉం డాలని, సమాజమంత ఒక్కటే అని మన నాయకుడిని మనమే ఎంచుకోవాలని ఆనాడు బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కే ఈరోజు దేశాన్ని నడిపిస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయం తి సందర్భంగా నేరడిగొండ మండల కేంద్రంలోని సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భం గా ఎమ్మెల్యే అనిల్ జాదవ్  మాట్లాడుతూ...  ప్రపంచం మెచ్చుకున్న అద్భుత మైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ప్రపంచ మేధావిగా కీర్తి గాంచి న అంబేద్కర్ కలలు గన్న కులవివక్ష లేని సమసమాజం నిర్మాణం జరగాలని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి లాంటిదని అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తు చేశారు.  కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, నాయకులు శివారెడ్డి, రాథోడ్ సజన్, పండరీ, రవీందర్ రెడ్డి, పెంట రమణ, దేవేందర్ రెడ్డి, సురేందర్, గులాబ్ తదితరులు పాల్గొన్నారు.

* ఉట్నూర్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ పాల్గొన్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్‌తో కలిసి ఎమ్మె ల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీ న వర్గాల జీవుతాల్లో వెలుగులు నింపేందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.  అదేవిధంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నా రు. ముందుగా పార్టీ కార్యాలయం నుం డి పార్టీ శ్రేణులతో కలిసి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లో అంబేద్కర్ విగ్రహానికి మా జీ మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాంగ్రెస్ పట్టణ ఆఫీసులో జరిగిన అంబేద్కర్ జయంతిలో వేడుకల్లో  ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే  గడ్డం వినోద్ నివా ళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గేల్లి జయరాం, పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, కాంగ్రెస్ నాయకులు అనంతరం ఏఐసీసీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకి ర్యాలీ తీయడం జరిగింది కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దళితుల పాలిట దేవుడు అంబేద్కర్

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే దళితులకు, గిరిజనులు, బలహీన వర్గాలకు మనుగడే లేదనీ, ఆయనే మా పాలిట నిజమైన దేవుడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు. బిఆర్ అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకొని బెల్లంపల్లి  కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏమాజి మాట్లాడుతూ వాడవాడలో జయంతి వేడుకలు ఘనం గా జరపాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి అన్నారు.

ఈ రోజూ నుండి ఈ నెల 25 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు అన్ని గ్రామా ల్లో, వార్డుల్లో నిర్వహించాలని అన్నారు. జయంతి రోజు జిల్లాలోని అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల శుద్ది కార్యక్ర మం చేపట్టామన్నారు. ఆయన  భారత రాజ్యాంగ పీఠిక చదివి కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన మహాను భావుడు అన్నారు. ఆయన అన్ని వర్గాల నాయకుడు అని అన్నారు. మహిళల కో సం ప్రత్యేక హక్కులు కల్పించాడని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రిజర్వేషన్లు కల్పించి వారి పాలిట దేవుడయ్యాడని అన్నారు.

కానీ నేటికీ అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం, అవమానించడం దుర్మా ర్గం అన్నారు. కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్‌ను అవమానించారని, ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని వాపోయా రు. కాంగ్రెస్ జైభీమ్, జై రాజ్యాంగం అని కపట నాటకం ఆడుతున్నదని , కాం గ్రెస్ నైజాన్ని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు  తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణ దేవరాయలు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, శ్రీనివాస్, తుకా రాం, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్‌కు మార్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి పాల్గొన్నారు.