కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పలువురు టాప్ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులను అధిగమి ంచి దేశంలోనే అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తిగా అవతరించా డు. ఈ ఏడాది రూ.92 కోట్ల పన్నుతో షారుఖ్ ఖాన్ అగ్ర స్థానంలో నిలిచాడు. దేశంలో నే అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుడిగా ఉన్న టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. తమిళ నటుడు విజయ్ ఒక్కో సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటూ ఏడాదికి రూ.80 కోట్ల పన్ను చెల్లించే జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్ల పన్ను చెల్లించి దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నారు. టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్ల పన్ను చెల్లింపుతో ఐదో స్థానంలో నిలిచాడు. అక్షయ్ కుమార్ 2022 సంవత్సరానికి అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచాడు, కానీ అతను ఇప్పుడు జాబితాలో పడిపోయాడు. కరీనా కపూర్ ఖాన్ రూ.20 కోట్లు పారితోషికం చెల్లించగా, కియారా అద్వానీ రూ.12 కోట్లు, కత్రినా కైఫ్ రూ.11 కోట్లు చెల్లించారు.