calender_icon.png 13 February, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్మాషులు అవుట్ అండ్ అవుట్ కామెడీ

13-02-2025 12:07:15 AM

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న ఈ చిత్రాన్ని తార స్టొరీ టెల్లర్స్  బ్యానర్ పై బీ బాలకృష్ణ, సీ రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ లాంచ్ చేశారు. ఈ టీజర్ మంచి కామెడీతో ఆకట్టుకుంటోంది. విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా అలరించాయి.

టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా నటులు రాగ్ మయూర్, రచ్చ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాగమయూర్ మాట్లాడుతూ.. “బద్మాషులు’ టీజర్ హిలేరియస్ గా వుంది. కామెడీ చాలా అర్గానిక్ గా అనిపించింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’ అని రాగ్ మయూర్ పేర్కొన్నాడు.

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. “టీజర్ జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ. చాలా ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. చాలా క్లీన్ ఎంటర్‌టైనర్‌”అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన మహేశ్ చింతల, విద్యాసాగర్, కవిత, దీక్ష తదితరులు పాల్గొన్నారు.