దౌల్తాబాద్, జనవరి 17: బడీడు పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించాలని క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గాడి రాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో బడి బయట పిల్లల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుండి 14 సంవత్సరాల పిల్లల వివరాలు, మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల వివరాలను గుర్తించడానికి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యను అభ్యసించాల్సిన విద్యార్థిని, విద్యార్థులు బడిలోనే ఉండాలి తప్ప పనుల్లో ఉండవ ద్దన్నారు. వెట్టి చాకిరి పనుల్లో చేర్పించి నట్లయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ యశోద, తదితరులు పాల్గొన్నారు.