న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ ఎంపికయ్యాడు. ఇక ప్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు చేపట్టనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం గురువారం కొత్త కోచింగ్ సిబ్బందిని పరిచయం చేసింది. బదానీ 2021 నుంచి 2023 వరకు సన్‌రైజర్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు.