calender_icon.png 25 March, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాక్స్ వసూళ్ల రంగంలోకి బడంగ్‌పేట్ మున్సిపల్ కమీషనర్

23-03-2025 12:00:00 AM

మహేశ్వరం, మార్చి 22 (విజయ క్రాంతి): వంద శాతం టాక్స్ వసూళ్ళే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి అన్నారు.టాక్స్ వసూల్లో భాగంగా సిబ్బంది తో కలిసి కమిషనర్ సరస్వతి స్వయంగా బస్తీలో ఇంటింటికి తిరుగుతూ పెండింగ్ బిల్లులు చెల్లించని ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించేలా కృషి చేయాలన్నారు. పన్నులు చెల్లించని వారి ఇండ్లకు నీటి సరఫరా తో పాటు డ్రైనేజీ వ్యవస్థ పని చేయకుండా నిలిపి వేస్తామని హెచ్చరించారు. ఈ పన్నుల వసూలు కార్యక్రమంలో మున్సిపల్ ,రెవిన్యూ ఇన్స్పెక్టర్ మమతా, బిల్ కలెక్టర్ కమలాకర్ రెడ్డి, శ్రీహిల్స్ జాయింట్ సెక్రటరీ జెల్ల రమేష్ గౌడ్, వెంకటయ్య, రవీందర్ నాయక్, యాదగిరి రావు, రవీందర్, ఉగ్రీ గిరి పాల్గొన్నారు.