calender_icon.png 16 November, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా ‘బడాఖాన్’

04-11-2024 01:17:23 AM

  1. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన పోలీసులు 
  2. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్, మల్టీజోన్-2 టీమ్‌ల మధ్య టగాఫ్‌వార్

రాజేంద్రనగర్, నవంబర్ 3: ప్రతినిత్యం బిజీగా ఉండే పోలీసులు విధులను కాసేపు మరిచిపోయి ఉత్సాహంగా క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ విజయ్ ఆనంద్ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక అయ్యింది. గణేశ్ ఉత్సవాలు, బోనా ల వేడుకలు పూర్తయిన తర్వాత ఏటా పోలీసులకు క్రికెట్ మ్యాచ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈక్రమంలో శనివారం రాత్రి అత్తాపూర్ విజయ్ ఆనంద్ క్రికెట్ గ్రౌండ్‌లో హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్, అదేవిధంగా మల్టీజోన్  టీంలు క్రికెట్ ఆడాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి నుంచి అందరూ పాల్గొన్నారు. డీసీపీ చంద్రమోహన్, శబరీష్ ఐపీఎస్ కెప్టెన్‌లుగా వ్యవహరించారు.

మొత్తం 15 ఓవర్లలో సౌత్‌వెస్ట్ జోన్ టీం 135 రన్స్ చేయగా మల్టీ జోన్ 115 రన్లకు ఆల్ ఔట్ అయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సౌత్ వెస్ట్ జోన్ నుంచి ఆడారు. ఆయన 16 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా వేసి ఆకట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా పోటీల్లో పాల్గొన్నారు. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ 19 రన్స్ చేశారు.

టప్పాచబుత్ర కానిస్టేబుల్ సునీల్ 74 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఆద్యంతం ఉత్సాహంగా ఆడిపాడారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.