calender_icon.png 3 February, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడాచోర్.. బత్తుల ప్రభాకర్

03-02-2025 01:06:30 AM

  • పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
  • తెలుగు రాష్ట్రాల్లో అతడిపై 80 కేసులు
  • యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసి నేరాలు
  • మీడియా సమావేశంలో డీసీపీ వినీత్

రంగారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రీజం పబ్‌లో శనివారం పోలీసులపై కాల్పుల జరిపిన బత్తుల ప్రభాకర్ (30) అలియాస్ రాహుల్‌రెడ్డి, బయ్యపురెడ్డి, రాజు, రాజేశ్, బిట్టు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని మాదాపూర్ డీసీపీ వినీత్ పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం క్రైమ్ డీసీపీ నరసింహతో కలిసి డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడారు..

ఏపీలోని చిత్తూ రు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్తుడేనని, 2013 నుంచే నేరాలబాట పట్టి పలు ఇళ్లలో చోరీలు చేశాడని తెలిపారు. 2022లో ఓ కేసు విచారణ నేపథ్యంలో అనకాపల్లి జైలు నుంచి విశాఖ జైలుకు తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లుగప్పి తప్పిం చుకొన్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం ప్రీజం పబ్ సమీపంలో బత్తుల ప్రభాకర్ ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారన్నారు.

ఈ విషయం పసిగట్టిన బత్తుల ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరపగా హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కాలికి బు ల్లెట్ గాయమైందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడి ఇంట్లో 451 తుపాకీ తూటాలతో పాటు మూడు తుపాకులు దొరికాయన్నారు.

యూట్యూబ్‌లోని క్రైమ్‌కు సంబంధించిన వీడియోలు చూసి నేరాలకు పాల్పడేవారన్నారు. అతడిపై ఏపీ, తెలంగాణల్లో 80 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో 11, ఏపీలో 12 కేసు ల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పారు.

ప్రభాకర్‌కు ఓ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నా రు. వారి పేరుమీదుగానే కార్లు, ఇతర విలువైన వస్తువులు కొన్నాడని, ప్రభాకర్  రూ.2.5 కోట్ల చోరీ సొత్తుకు పాల్పడ్డాడని తెలిపారు.