calender_icon.png 30 September, 2024 | 4:45 AM

సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం

30-09-2024 02:48:20 AM

  1. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదు
  2. కేవలం ఓఆర్‌ఆర్ వరకే హైడ్రా పరిధి
  3. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం 

హైదరాబాద్ సిటీబ్యూరో/సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సంగారెడ్డి  మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రా చేపట్టలేదని, ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సం బంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూల్చివేతలు జరిగినా దానిని హైడ్రాకు ముడిపెడుతూ, హైడ్రాను అప్రతిష్ఠపాలు చేయడానికి కొంతమంది సామాజిక మాధ్యమా ల్లో వార్తలు వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

సం గారెడ్డి ఘటనలో హోంగార్డుకు గాయ మై కోలుకుంటున్నాడని, కూకట్‌పల్లి చెరువు పరిసరాల్లో ఇంటిని కూల్చి వేస్తారేమోనని భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం వంటి వాటిని హైడ్రాకు ముడి పెట్ట డం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఔటర్ రింగ్ రోడ్డు  (ఓఆర్‌ఆర్) వరకు మాత్రమే హైడ్రా పరిధి అని రంగనాథ్ స్పష్టం చేశారు.