calender_icon.png 22 October, 2024 | 6:10 AM

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం

22-10-2024 02:21:49 AM

పదేళ్లలో తెలంగాణను 

అప్పుల్లోకి నెట్టింది

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి 

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నిజామాబాద్ న్యూడ చైర్మన్‌గా కేశ వేణు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా, డబుల్ బెడ్ రూమ్ అంశాలపై బీఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. పదేళ్ల పాలన లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లోకి నెట్టిందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంకోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నూడా ప్రజల తో మమేకమయ్యే 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో హైదారాబాద్, వరంగల్ తర్వాత అత్యంత పెద్ద జిల్లా నిజామాబాద్ అని, అభివృద్ధికి అవకాశలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షు డు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, కార్పొరేషన్ చైర్మ న్లు మానాల మోహన్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బీన్ హూందాన్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, ఆర్మూర్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు.

విద్యార్థులను రెచ్చగొడుతున్న బీఆర్‌ఎస్: పీసీసీ చీఫ్

గ్రూప్-1 పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తు న్నాయని, బీఆర్‌ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని పీసీసీ అధ్య క్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల కృషితోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టిం చారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు రోడ్డు ఎక్కడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6 వేల కొట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ నమోదును కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉద్యమంలా చేపట్టి పార్టీ అభ్యర్థులను గెలి పించాలని కోరారు.