calender_icon.png 30 November, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం

30-11-2024 03:38:03 PM

హాస్టల్లో జరుగుతున్న ఘటనలకు బాధ్యులను గుర్తిస్తాం. 

కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాతి. 

కాంగ్రెస్ వచ్చాకే రైతులకు మంచి రోజులు.

టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి  పల్లె రామచంద్ర గౌడ్.

రామాయంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని కావాలని ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుష్ప్రచారం చేయడం జరుగుతుందని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు. హాస్టల్లో జరుగుతున్న కొన్ని ఘటనలకు వాటిని ప్రోత్సహించి అధికార పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాతి అని, కాంగ్రెస్ వచ్చాకే రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు సకాలంలో అందుతున్నాయని దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేయడంతో పాటు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురుకులాల్లో జరుగుతున్న ఘటనలకు అప్పటి కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లే కారణమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హాయంలో పనిచేసిన కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై గురుకులాల్లో సమస్యలు సృష్టించే విధంగా ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు బయటకు వస్తాయని ఇలా గురుకులాల్లో సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే కూడా. విద్యార్థులకు ఇచ్చే ఛార్జీలో సైతం పెంచడం జరిగిందని, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి కూడా బడ్జెట్ కేటాయించిన విషయం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులను రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలని ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండి అలజడులు సృష్టించే వారిని మాటలు నమ్మొద్దని ఆయన కోరారు. విద్యార్థులతో చెలగాటం ఆడే వారిని ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.