calender_icon.png 25 November, 2024 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావాలనే ఎస్సీ గురుకులాలపై దుష్ప్రచారం

14-10-2024 02:30:47 AM

ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి

హైదరాబద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): ఎస్సీ గురుకులాల్లోని క్రీడాకారులైన విద్యార్థులకు ప్రోత్సహించ డం పై కొందరు వ్యక్తులు కావాలనే దు ష్ప్రచారం చేస్తున్నారని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఆది వారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్య క్తం చేశారు.

తైవాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూనివర్సిటీస్ వుమెన్ సాఫ్ట్‌బాల్ ఏషియా కప్ పోటీలకు ఎ స్సీ గురుకులాలకు చెందిన ముగ్గురు విద్యార్థునులు ఎంపికయ్యారని, ఆ విద్యార్థులు వారి కోచ్‌తో కలిసి ఇప్పటికే చెన్నై నుంచి తైవాన్‌కు వెళ్లారని స్పష్టం చేశారు. వారికి కావాల్సిన అ న్ని వసతులు, ప్రయాణ సదుపాయాలను ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాటు చేసిందని తెలిపారు.

ఈ  విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ అభినందనలు తెలిపి, విజయంతో తిరిగి రావాలని ప్రోత్సహించారని తెలిపారు. నైపుణ్యం ఉన్న షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయించిందని తెలిపారు.