calender_icon.png 27 October, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తృప్తినిచ్చే ‘బ్యాడ్‌న్యూజ్’

04-07-2024 12:05:00 AM

‘యానిమల్’ చిత్రంతో యూత్ ఫెవరేట్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ఈ ఒక్క సినిమాతో ఆమె జీవితమే మారిపోయిందని చెప్పడంలోనూ అతిశయోక్తి కాదు. యానిమల్ సినిమాలో ఈ సొగసరి యాక్టింగ్, రొమాన్స్‌తో అవకాశాలు క్యూ కట్టాయి.. ఇప్పుడు ఆమె ఏ సినిమాలో నటించినా భారీ కలెక్షన్లు పక్కా అనేంతగా ఈ అమ్మడి ప్రభావం బాక్సాఫీస్‌పై పడిపోతోందంటున్నారు. పనిలో పనిగా దీపం ఉన్నప్పుడే ఇల్లు కొనిపెట్టుకోవా లనుకుందో ఏమో గానీ ముంబయిలో ఓ కొత్త ఇంటికి ఓనర్‌గా మారిపోయిందట ఈ చక్కనమ్మ.

ఈ విషయాలన్నీ కాసేపు అటుంచితే.. ఈ భామకు సంబంధించి ‘బ్యాడ్ న్యూజ్’ పేరుతో వైరల్ అవుతున్న ఓ గుడ్ న్యూస్ విన్నారా?! ఆ శుభవార్త ఏంటో చూద్దాం రండి.. విక్కీ కౌశల్ సరసన త్రిప్తి నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ చిత్రం ఇదే నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఆనంద్ తివారీ వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గుడ్‌న్యూస్ అంటూ ‘బ్యాడ్‌న్యూజ్’ మూవీ గురించి చెప్తున్నారు.. అదీగాక త్రిప్తి డిమ్రి గురించి శుభవార్త అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఇంకాస్త ముందుకెళ్లండి.. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగింది.

విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ట్రైలర్ 3 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవటంతో నెటిజన్లు ఈ క్రెడిట్‌నంతా త్రిప్తి డిమ్రి ఖాతాలో జమ చేస్తున్నారు. తెరపై అసలు.. సోషల్ మీడియాలో కొసరు... అన్నట్టుగా అందచందాలను ఆరబోస్తూ కుర్రకారును తన వైపు తిప్పుకుంటుంటే ‘క్రెడిట్స్‌కేం తక్కువ.. త్రిప్తి డిమ్రి కోసం క్రెడిట్ కార్డ్సూ గీకేసేటట్టున్నారు వీళ్లు’ అంటూనే ట్రైలర్‌ను మళ్లీ మళ్లీ చూస్తున్నవారూ ఉంటుండటం కొసమెరుపు.