calender_icon.png 27 October, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటచేలల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి

12-09-2024 09:10:49 PM

మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి

మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని రైతులు తమ పంట చేలల్లో నీరు నిలువ లేకుండా చూడాలని నిలిచిన నీటిని కాలువల ద్వారా బయటకి పంపించాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి సూచించారు. గురువారం మండలంలోని అందుగులపేట గ్రామంలోని పత్తి ,మిరప పంట చేలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పత్తి పంటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, రసం పీల్చు పురుగు నివారణ చర్యలు వివరించారు. అంతేకాకుండా మిరపలో పై ముడుత,కింద ముడుత నివారణకు రోగార్ లేదా డైఫెంతురాన వంటి మందులు వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకోవాలని,ఆంత్రాక్నోస్ ఆకు మచ్చ తెగులు నివారణకు అజాక్సిస్ట్రోబిన్ లేదా మంకోజెబ్ వంటి మందులు వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి,కనకరాజు,గ్రామ  రైతులు హనుమంత రెడ్డి, ఆశిరెడ్డి,వెంకటరెడ్డి,మహేష్ లు పాల్గొన్నారు.