- ట్రూడోకు మిత్రపక్షం నుంచి షాక్
- ప్రతిపక్షంతో క్యూబెక్ పార్టీ ములాఖత్
మాంట్రియల్, అక్టోబర్ 30: ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్న లిబరల్ పార్టీ అధినేత, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు భారీ షాక్ తగిలింది. ట్రూడో నేతృత్వంలోని సంకీర్ణ సర్కారులో కీలకపాత్ర పోషిస్తున్న క్యూబెక్ పార్టీ.. ప్రతిపక్షంతో చేతులు కలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది.
త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ మరోసారి ప్రధాని కావాలనుకుంటున్న ట్రూడోకు దీనిని భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాము సూచించిన పలు అంశాలను ట్రూడో పరిగణనలోకి తీసుకోకపోవడంతోనే ప్రతిపక్షంతో క్యూబెక్ పార్టీ చేతులు కల్పినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ట్రూడోపై క్యూబెక్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. దేశంలోని వృద్ధుల భద్రత కోసం వారికి చెల్లింపులను పెంచాలని తాము చేసిన సూచనలను ట్రూడో సర్కారు పట్టించుకోలేదని, అంతేకాక దాన్ని నెరవేర్చడంలో ట్రూడో సర్కారు విఫలం కావడంతోనే ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నది.
దేశం, ప్రజల అభివృద్ధి కోసమే ప్రతిపక్షాలతో తాము చేతులు కలిపినట్లు ఆ పార్టీ వివరించింది. కాగా ప్రతిపక్షంతో క్యూబెక్ పార్టీ ములాఖత్ కావడంతో ట్రూడో ఆధ్వర్యంలోని లిబరల్ పార్టీకి చిక్కులు తప్పవని భావిస్తున్నారు. కెనడా పార్లమెంట్‌లో మొత్తం 338 స్థానాలు ఉండగా ట్రూడో పార్టీకి 153 మంది ఎంపీలు ఉన్నారు.