calender_icon.png 5 October, 2024 | 10:55 AM

అణుబాంబు వేసేందుకు వెనకాడం

05-10-2024 12:37:55 AM

కిమ్ హెచ్చరిక 

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: శత్రువులు తమ దేశ సార్వభౌమధికారాన్ని ధిక్కరించేలా సాయుధ బలగాలను ఉపయోగిస్తే నిస్సందేహంగా అణ్వాయుధాలతో విరుచుకుపడతామని అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరించారు. శుక్రవారం పాం గ్యాంగ్‌లోని ప్రత్యేక దళాల సైనిక శిక్షణ స్థావరాన్ని సందర్శించిన అ నంతరం ఈ ప్రకటన చేశారు. ‘ఉత్తర కొరియా తమపై అణ్వాయుధాలను ప్రయోగిస్తే అమెరికాతో కలిసి ఎదుర్కొంటా.

ఆ రోజుతో ఉత్తరకొరి యా పాలన ముగుస్తుంది’ అని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌యోల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బదులుగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నిత్యం క్షిపణులు, బాంబు పరీక్షలతో తన దేశ ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. పాంగ్యాంగ్‌పై దక్షిణకొరి యా, అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. నిస్సంకోచంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని కిమ్ హెచ్చరించారు.